logo

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త బీమా చేసుకోవాలని, తద్వారా తమ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం పాపన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు.

Published : 20 Jan 2022 01:59 IST

బీమా చేసుకుంటే ప్రయోజనం


కుర్తివాడలో మాట్లాడుతున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు

పాపన్నపేట, మెదక్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త బీమా చేసుకోవాలని, తద్వారా తమ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం పాపన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ఆందోళన చెందవద్దని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా కుర్తివాడలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త సార సత్యనారాయణ కుటుంబీకులను ఆయన పరామర్శించి వారికి రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. అనంతరం అబ్లాపూర్‌లో పార్టీ కార్యకర్త భిక్షపతి కుమారుడు ఓంకార్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని, మెదక్‌లో పుర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌ తండ్రి గట్టాగౌడ్‌ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబీకులను ఆయన పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయలు, కిసాన్‌, ఓబీసీ, యూత్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, పల్లె రాంచందర్‌, మహేందర్‌రెడ్డి, కార్యదర్శి ప్రేమ్‌రాథోడ్‌, ఎంపీటీసీ సభ్యుడు రమేశ్‌ గౌడ్‌, నాయకులు ఆంజనేయులు గౌడ్‌, రమేశ్‌ గౌడ్‌, ప్రేమ్‌కుమార్‌, భూపతి, అజయ్‌గౌడ్‌ ఉన్నారు.

‘కాలయాపన సరికాదు’

మెదక్‌ అర్బన్‌: మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నా వితంతువులకు పింఛను మంజూరు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇది సరికాదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు అన్నారు. బుధవారం మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో సుమారుగా 200 మంది వితంతువులు పింఛను కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వానికి వారి పట్ల కనికరం లేకుండా పోయిందని ఆరోపించారు. పింఛనుతో పాటు రెండు పడక గదుల ఇళ్ల మంజూరులో వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని