logo

అప్రమత్తతతోనే వైరస్‌కు అడ్డుకట్ట

పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే వైరస్‌కు అడ్డుకట్ట వేయగలమని నర్సాపూర్‌ ప్రాంతీయ ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ మిర్జాబేగ్‌ సూచించారు.

Published : 20 Jan 2022 01:59 IST

నర్సాపూర్‌, మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే వైరస్‌కు అడ్డుకట్ట వేయగలమని నర్సాపూర్‌ ప్రాంతీయ ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ మిర్జాబేగ్‌ సూచించారు. బుధవారం పట్టణంలో కొవిడ్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులపై వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కరోనా బారిన పడిన వారు ప్రత్యేక గదిలో ఉండాలని సూచించారు. రోగితో పాటు ఇంట్లోని అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. ఇతర ఏ సమస్య ఉన్నా 108కు ఫోన్‌ చేయాలని సూచించారు. పట్టణంలో కేసులు పెరుగుతుండడంతో పలు వార్డుల్లో పురపాలిక హైపోక్లోరైడ్‌ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించింది. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌, పారిశ్రామిక ప్రాంతంలో సర్పంచి మల్లేశ్‌, పంచాయతీ సిబ్బందితో కలిసి వీధుల్లో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు