logo

కల్తీ పదార్థాలు విక్రయిస్తే కఠినచర్యలు

ప్రజలు తినే ఆహార పదార్థాల తయారీలో కల్తీ నూనెలు, ముడి సరకులను వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్‌ జిల్లా ఆహార తనిఖీ అధికారి ఉదయ్‌కిరణ్‌ హెచ్చరించారు.

Published : 20 Jan 2022 01:59 IST

నర్సాపూర్‌ టౌన్‌: ప్రజలు తినే ఆహార పదార్థాల తయారీలో కల్తీ నూనెలు, ముడి సరకులను వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్‌ జిల్లా ఆహార తనిఖీ అధికారి ఉదయ్‌కిరణ్‌ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని పలు హోటళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ వంట నూనెల విక్రయ దుకాణంలో నూనె నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న రాష్ట్ర ఆహార పదార్థాల ప్రయోగశాలకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. హోటళ్లు నిర్వహించే వ్యాపారులు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను పొంది ఉండాలని సూచించారు. లైసెన్స్‌ తీసుకోని వ్యాపారులు వారం రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టిఫిన్‌, తినుబండారాల విక్రయదారులు ప్రజలకు నాణ్యమైన వాటిని అందించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని