logo

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదనపు పాలనాధికారి రమేశ్‌ సూచించారు. బుధవారం స్థానిక టీఎన్జీవో భవనంలో సంఘం నూతన సంవత్సర దైనందిని, కాలమానిని అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

Published : 20 Jan 2022 01:59 IST

దైనందినిని ఆవిష్కరిస్తున్న అదనపు పాలనాధికారులు రమేశ్‌, ప్రతిమాసింగ్‌ తదితరులు

మెదక్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదనపు పాలనాధికారి రమేశ్‌ సూచించారు. బుధవారం స్థానిక టీఎన్జీవో భవనంలో సంఘం నూతన సంవత్సర దైనందిని, కాలమానిని అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ.. టీఎన్జీవోతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, జిల్లాలో ఉద్యోగుల సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జీవో 317 ప్రకారం ఉద్యోగుల స్థానిక కేడర్ల కేటాయింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికి కష్టపడి పనిచేసిన అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులను ఆమె అభినందించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ మాట్లాడుతూ.. సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూ గత ఏడేళ్లుగా అనేక సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. జీవో 317తో ఉద్యోగుల కేటాయింపులో కొంత ఇబ్బంది జరిగింది వాస్తవమేనని, త్వరలో అన్ని సమస్యలు తొలగిపోతాయన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలందిస్తూ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్‌, సహ అధ్యక్షుడు సాదిక్‌ అలీ, ఉపాధ్యక్షులు అనురాధ, మనోహర్‌, ఫణిరాజ్‌, ఇక్బాల్‌పాష, అర్షద్‌, ఫజల్‌, బాధ్యులు శంకర్‌, కోటి రఘునాథ్‌రావు, చిరంజీవాచార్యులు, వినోద్‌, శేషాచారి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభాకర్‌, శంకర్‌గౌడ్‌, రామాగౌడ్‌, విజయ్‌కుమార్‌, యాదగిరి, శ్రీనివాస్‌, సలావుద్దీన్‌, మంజుల, మెర్సీనా, సంతోష్‌, గాంధీ, గణేశ్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని