logo

సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌

తమకున్న ఆస్తి తగాదాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి తీర్చాలని ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘఠన మండల పరిధిలోని కల్పగూర్‌ శివారులోని సన్‌షైన్‌ కాలనీలో చోటుచేసుకుంది. హాస్టల్‌ గడ్డకు చెందిన మహ్మద్‌

Published : 21 Jan 2022 02:12 IST

టవర్‌ పైన యువకుడు

సంగారెడ్డి గ్రామీణం: తమకున్న ఆస్తి తగాదాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి తీర్చాలని ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘఠన మండల పరిధిలోని కల్పగూర్‌ శివారులోని సన్‌షైన్‌ కాలనీలో చోటుచేసుకుంది. హాస్టల్‌ గడ్డకు చెందిన మహ్మద్‌ ఫారూక్‌  సెల్‌ టవర్‌పైనే మూడు గంటలు గడిపి డిమాండ్‌ చేశాడు. ఎవరు చెప్పినా యువకుడు వినకపోవడంతో ఘఠనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ రమేష్‌, గ్రామీణ పోలీసులు యువకుడితో చరవాణిలో మాట్లాడారు. సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని  హామీ ఇవ్వడంతో అతడు కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని