logo

ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరి పరిస్థితి విషమం

వెనుకనుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్పంగా గాయాలైన సంఘటన గురువారం రాత్రి మండల కేంద్రమైన న్యాల్‌కల్‌లో చోటు చేసుకుంది. హద్నూర్‌ ఏఎస్సై జగదీశ్వర్‌ తెలిపిన

Published : 21 Jan 2022 02:12 IST

మరో నలుగురికి స్వల్ప గాయాలు

న్యాల్‌కల్‌, న్యూస్‌టుడే: వెనుకనుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్పంగా గాయాలైన సంఘటన గురువారం రాత్రి మండల కేంద్రమైన న్యాల్‌కల్‌లో చోటు చేసుకుంది. హద్నూర్‌ ఏఎస్సై జగదీశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌కల్‌లోని ఎసీˆ్స కాలనీకి చెందిన రైతులు, కూలీలు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో ముంగి గ్రామానికి చెందిన చింటు (20), ప్రవీణ్‌కుమార్‌ (17)లు ద్విచక్ర వాహనంపై న్యాల్‌కల్‌కు వస్తున్నారు. ముంగి- న్యాల్‌కల్‌ రోడ్డు, తహసీˆల్దార్‌ కార్యాలయ సమీపాన కాలినకన వెళ్తున్న రైతులు, కూలీలు గంగారం మొగులయ్య (52), నాగమ్మ (35), అన్నమ్మ (36), ప్రేమలమ్మ (38)లను వెనుకనుంచి వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొగులయ్య, చింటులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానికులు మొగులయ్యను జహీరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, చింటును బీదర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన మిగతా వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. హద్నూర్‌ పోలీసులు ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని