logo

పొదుపుగా ఇంధన వనరుల వినియోగం

ఇంధన వనరులను పొదుపుగా వాడుకొని భావితరాలకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ తెలిపారు. గురువారం అక్కన్నపేట మండల పరిషత్తు

Published : 21 Jan 2022 02:12 IST

ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌

ఫ్యాన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, తదితరులు

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: ఇంధన వనరులను పొదుపుగా వాడుకొని భావితరాలకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ తెలిపారు. గురువారం అక్కన్నపేట మండల పరిషత్తు కార్యాలయంలో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(రెడ్‌కో) ఆధ్వర్యంలో రాయితీపై గిరిజనులకు ఇచ్చిన సీలింగ్‌ ఫ్యాన్లు పంపిణీ చేశారు. ఈ ఫ్యాన్లు బహిరంగ విపణిలో ఒక్కోటి రూ.2500 ఉండగా రెడ్‌కో కేవలం రూ.500 అందిస్తోందన్నారు. 14 గ్రామాలకు గాను 271 మందికి పంకాలు పంపిణీ చేసినట్లు సంస్థ ప్రతినిధులు రామేశ్వర్‌రావు, రాజేశ్వర్‌రావు తెలిపారు. అవకాశాన్ని గిరిజనులు వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్న అక్కన్నపేటలో కోనేటి రాజు, గొల్లకుంటలో నార్లపురం సదానందంతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇటీవల మృతి చెందిన జంగపల్లి శ్రవణ్‌కుమార్‌, గాంధీనగర్‌లో సటికం వెంకటయ్య, మోత్కులపల్లిలో అందె ఓదెలు, రావుల యాదయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.అక్కన్నపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంకును సందర్శించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ సంజీవ్‌కుమార్‌, సర్పంచి ముత్యాల సంజీవరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, తెరాస మండల అధ్యక్షులు పెసరి సాంబరాజు, వంగ వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు వెల్ది శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని