logo

సమ్మక్క సారలమ్మ జాతర సందడి షురూ..

రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు అవసరమైన బంగారం (బెల్లం) నిల్వలు దిగుమతి అవుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో మొక్కులు తీర్చుకునేందుకు ఇప్పటి నుంచే సిద్ధం

Published : 21 Jan 2022 02:12 IST

భారీగా దిగుమతి  అవుతున్న బెల్లం

హుస్నాబాద్‌లో లారీలో నుంచి బెల్లంను దించుతున్న కూలీలు

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌: రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు అవసరమైన బంగారం (బెల్లం) నిల్వలు దిగుమతి అవుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో మొక్కులు తీర్చుకునేందుకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతుండగా హుస్నాబాద్‌ పట్టణంలో బెల్లం దిగుమతి భారీ ఎత్తున అవుతోంది. కామారెడ్డి, నిజామాబాద్‌ పరిసరాల నుంచి సరఫరా అవుతుండగా హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల భక్తులు ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. జాతర పూర్తయ్యే వరకు ఇక్కడ బెల్లం కొనుగోళ్ల సందడి భారీగా ఉంటుంది. ప్రతి కుటుంబం వన దేవతలైన సమ్మక్క సారలమ్మలను పూజించి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత జాతర సమయంలో దాదాపు 20 లారీల బెల్లం విక్రయించినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం నుంచి నిలువెత్తు తూకాలు ప్రారంభం కానుండగా అనంతరం ఇంట్లో వేడుక నిర్వహించి వీలునుబట్టి మేడారం వెళతారు. అక్కడి వరకు వెళ్లలేని వారు భక్తులు పరిసర గ్రామాల్లో జరిగే జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. ఇదివరకు బెల్లం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ఆంక్షలు అమలు చేయగా ప్రస్తుతం సడలించినట్లుగా చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని