logo

చాముండేశ్వరి దర్శనం.. భక్తజన పరవశం

చిలప్‌చెడ్‌ మండలం చాముండేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయం ముందు ప్రవహిస్తున్న మంజీరా నది నుంచి జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేపట్టారు. గణపతి పూజ, స్వస్తి వాచనం,

Published : 23 Jan 2022 02:59 IST

ప్రత్యేకాలంకరణలో అమ్మవారు

చిలప్‌చెడ్‌, న్యూస్‌టుడే: చిలప్‌చెడ్‌ మండలం చాముండేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయం ముందు ప్రవహిస్తున్న మంజీరా నది నుంచి జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేపట్టారు. గణపతి పూజ, స్వస్తి వాచనం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మహాపూజ, మహానివేదన జరిగాయి. అనంతరం మహాచండీ హవనం చేపట్టారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదానం కొనసాగింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి సంతోష్‌గౌడ్‌ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట నర్సాపూర్‌ కోర్టు న్యాయమూర్తి అనిత తదితరులు ఉన్నారు.

హోమం నిర్వహిస్తున్న వేదపండితులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని