logo

దళితబంధు అమలుకు కార్యాచరణ

దళిత బందు పథకం అమలుపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.

Published : 23 Jan 2022 04:57 IST

నేడు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సదస్సు


దృశ్య మాధ్యమ సమీక్షకు హాజరైన పాలనాధికారి హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: దళిత బందు పథకం అమలుపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో పాల్గొన్న పాలనాధికారి హనుమంతరావు మాట్లాడుతూ.. జిల్లాలో 2,76,691 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. నేడు (ఆదివారం) మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో దళితబంధు అమలుపై కార్యాచరణ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీఆర్వో శ్రీనివాస్‌రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని