logo

7,030 మంది వైరస్‌ అనుమానితులు

కరోనా వైరస్‌ చాప కింద నీరులా తీవ్రరూపం దాల్చుతోంది. మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వేకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈనెల 21న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం

Published : 23 Jan 2022 04:57 IST

ఇంటింటి సర్వేలో వెల్లడి

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ చాప కింద నీరులా తీవ్రరూపం దాల్చుతోంది. మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వేకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈనెల 21న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం నుంచి జిల్లాలో బృందాలు సర్వేకు ఉపక్రమించాయి. ఈ సర్వేను ఈనెల 22వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ఎం.హనుమంతరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సర్వే ముగిసిందా.. నిరంతరం కొనసాగుతుందా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, బిల్‌ కలెక్టర్లు, రిసోర్స్‌ పర్సన్లు, మహిళా సమాఖ్య సభ్యులు బృందాలుగా ఏర్పడి ఇంటింటా ఉదయం నుంచి రాత్రి వరకు జ్వర సర్వే చేశారు. కరోనా లక్షణాలు కలిగిన అనుమానితుల వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా.. వారికి కరోనా మందుల కిట్లు ఉచితంగా అందించారు. నాలుగు రోజుల తర్వాత ఆరోగ్యం కుదుట పడకుంటే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.


కరోనా @ 99

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం 99 మంది వైరస్‌ బారిన పడినట్లు  ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. యాంటిజెన్‌ పరీక్షల్లో 1541 మంది నమూనాలు సేకరించగా 65 మందికి, ఆర్‌టీపీసీఆర్‌లో  159 మందిని పరీక్షించగా 34 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆమె ప్రకటించారు. బాధితుల్లో పటాన్‌చెరులో 35 మంది, సంగారెడ్డిలో 25, జహీరాబాద్‌లో 15, నారాయణఖేడ్‌లో 15మంది, బొల్లారం, కంది, గుమ్మడిదలలో ఇద్దరికి చొప్పున ఆరుగురు, రామచంద్రాపురంలో (జీహెచ్‌ఎంసీ)ముగ్గురు  ఉన్నట్లు వివరించారు. అందరూ హోంఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

జిల్లాలో శనివారం 15,642 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి తెలిపారు. పీహెచ్‌సీల స్థాయిలో 3,739, ఆరోగ్య ఉప కేంద్రాల్లో 9,300, పురపాలక పరిధిలో 1,322, 15-18 ఏళ్ల వయస్సుల వారిలో 1,014, బూస్టర్‌ డోస్‌ 267 మందికి టీకా ఇచ్చామని ఆమె వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని