logo

అన్ని వర్గాలకు సమన్యాయం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని, తద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో రూ.78 లక్షల వ్యయంతో

Published : 23 Jan 2022 04:57 IST
భాజపా నేతలు చెప్పేవి అబద్దాలే.. 
రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు
కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని, తద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో రూ.78 లక్షల వ్యయంతో నిర్మించనున్న మురుగు కాలువలు, రూ.75 లక్షల వ్యయంతో నిర్మించే ఈద్గా, దుకాణ సముదాయం, రూ.1.03 కోట్ల వ్యయంతో నిర్మించే విద్యుత్తు డీఈ కార్యాయాలనికి శంకుస్థాపన చేశారు. గజ్వేల్‌లోని ఐఓసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీలకు పోచంపల్లి చీరలను పంపిణీ చేశారు. అనంతరం 333 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.3.33 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానంతోనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది. రాష్ట్రంలో భాజపా నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని.. ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.7800 ఇస్తుంటే.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచి నెలకు రూ.13500 ఇస్తున్నామన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచి రాయితీ ఎగ్గొట్టారన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 9,96,960 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి,  సిద్దిపేట జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, జీపీ బల్దియా ఛైర్మన్‌ రాజమౌళి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఏఎంసీ అధ్యక్షురాలు మాదాసు అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దేవీరవీందర్‌, జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు