logo

గజ్వేల్‌ అభివృద్ధిపై సీఎం సమీక్ష

ప్రగతిని మరింత వేగిరపరిచి గజ్వేల్‌ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గజ్వేల్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,

Published : 24 Jan 2022 01:05 IST

ప్రగతిని మరింత వేగిరపరచేలా సూచన

కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న యాదవరెడ్డి

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ప్రగతిని మరింత వేగిరపరిచి గజ్వేల్‌ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గజ్వేల్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో గజ్వేల్‌ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ పనులు, మున్ముందు చేపట్టనున్న అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. గజ్వేల్‌లో నిర్మించనున్న క్రీడా గ్రామం, జీపీ బల్దియా పరిధి ప్రజ్ఞాపూర్‌లో ప్రయాణ ప్రాంగణం, గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన ప్రజలు ఏది కోరితే దానిని వెంటనే చేపట్టాలని, ప్రభుత్వ పథకాలు పక్కాగా అర్హులకు చేరేలా కృషి చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్సీ

ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి ఆదివారం మర్కూక్‌ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 27న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని