logo

మేమున్నామని.. ఆకలి తీరుస్తామని..

కరోనా వేళ.. ఇంటి నుంచి కదల్లేని బాధిత కుటుంబాలకు ‘అమ్మ సహాయ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ ఫౌండేషన్‌ మరోసారి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. సిద్దిపేటలో ఆహార పంపిణీ మొదలైంది. ఫౌండేషన్‌

Published : 24 Jan 2022 01:05 IST

కరోనా వేళ.. ఇంటి నుంచి కదల్లేని బాధిత కుటుంబాలకు ‘అమ్మ సహాయ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ ఫౌండేషన్‌ మరోసారి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. సిద్దిపేటలో ఆహార పంపిణీ మొదలైంది. ఫౌండేషన్‌ ద్వారా కొవిడ్‌ మొదటి, రెండో దశలో సిద్దిపేటలోని దాదాపు 250 కుటుంబాలకు వివిధ రూపాల్లో సహకారం అందించారు. కరోనా నుంచి కోలుకునే వరకు నేరుగా ఇళ్లకు చేరుకొని ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు. అదే స్ఫూర్తితో మరోసారి సాయానికి తెర తీశారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శివమ్స్‌ నాగేందర్‌ నేతృత్వంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం సాగిస్తున్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌ బారినపడి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి ఆహారం అందించనున్నారు. మొదటి రోజు ఆదివారం 50 మందికి ఇలా బాసటగా నిలిచారు. ఫౌండేషన్‌ సభ్యుడు షాదుల్‌ ఇంటింటికి చేరుకొని పంపిణీలో భాగస్వామి అవుతున్నారు. సాయం అవసరమైన వారు 63033 68474 నెంబరులో సంప్రదించాలని అధ్యక్షుడు కోరారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని