logo

నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం

వాహన చోదకులు రహదారి నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని పట్టణ ఎస్‌ఐ మురళి, మెదక్‌ ఆర్టీసీ డిపో సహాయక మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు. సోమవారం మెదక్‌లో ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్స్‌ డే నిర్వహించారు.

Published : 25 Jan 2022 01:53 IST

గులాబీ ఇచ్చి అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ మురళి, డిపో సహాయక మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: వాహన చోదకులు రహదారి నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని పట్టణ ఎస్‌ఐ మురళి, మెదక్‌ ఆర్టీసీ డిపో సహాయక మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు. సోమవారం మెదక్‌లో ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో గ్యారేజ్‌ నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఉదయం నుంచి డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2019 నుంచి ఆర్టీసీ సంస్థ డ్రైవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 24న డ్రైవర్స్‌ డే నిర్వహిస్తుందన్నారు. వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని, మద్యం తాగి, చరవాణి మాట్లాడుతూ వాహనాలు నడపొద్దన్నారు. ఆర్టీసీ ఏఈ తిరుమలేశ్‌, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు