logo

11 రహదారులు.. రూ.6.59 కోట్లు

గత ఏడాదిలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు మోక్షం లభించింది. మూడు మండలాల పరిధిలోని ఎనిమిది రహదారుల మరమ్మతులకు రూ.4.14 కోట్లు మంజూరయ్యాయి. ఈవిషయాన్ని ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ వెల్లడించారు. హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో ప్రధానంగా మసిరెడ్డితండా నుంచి ధర్మారం.

Published : 25 Jan 2022 01:53 IST

మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు మంజూరు
న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం

అక్కన్నపేట మండలం ధర్మారంలో కోతకు గురైన రోడ్డు

గత ఏడాదిలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు మోక్షం లభించింది. మూడు మండలాల పరిధిలోని ఎనిమిది రహదారుల మరమ్మతులకు రూ.4.14 కోట్లు మంజూరయ్యాయి. ఈవిషయాన్ని ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ వెల్లడించారు. హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో ప్రధానంగా మసిరెడ్డితండా నుంచి ధర్మారం... ధర్మారం నుంచి పోతారం(జె), రేగొండ స్టేజీ నుంచి బంజేరుపల్లి, పొట్లపల్లి పరిధిలోని ఆరపల్లి నుంచి హుస్నాబాద్‌, జిల్లెలగడ్డ నుంచి మీర్జాపూర్‌ వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి. కల్వర్టుల వద్ద వరదనీరు ప్రవహించడంతో కోతకు గురయ్యాయి. భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపారు. దీంతో నిధులు మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అక్కన్నపేట మండలం కట్కూర్‌ నుంచి వంకాయతండా, పంచరాయితండా మీదుగా దాసుతండా వరకు రూ.48 లక్షలు, మసిరెడ్డితండా నుంచి ధర్మారం మీదుగా కొండంరాజుపల్లి రోడ్డుకు రూ.52 లక్షలు, ధర్మారం, పోతారం(జె), నందారం రహదారికి రూ.62లక్షలు, హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ నుంచి సర్వాయిపేట మార్గానికి రూ.44లక్షలు, జిల్లెలగడ్డ నుంచి మీర్జాపూర్‌కు రూ.58లక్షలు, పొట్లపల్లి దేవేంద్రనగర్‌, ఆరపల్లి, హుస్నాబాద్‌ రహదారికి రూ.96లక్షలు, కోహెడ మండలం కూరెల్ల నుంచి లంబాడీతండాకు రూ.36లక్షలు, బస్వాపూర్‌ పరిధిలోని చంద్రానాయక్‌తండా- జగ్మాతండా రోడ్డుకు రూ.20లక్షల చొప్పున మంజూరయ్యాయి. రేగొండ స్టేజీ నుంచి బంజేరుపల్లి రోడ్డుకు త్వరలో నిధులు మంజూరు అవుతాయని అధికారులు పేర్కొన్నారు.

వీటికీ మోక్షం..
హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లోని పలు తారు రహదారుల పునరుద్ధరణకు రూ.2.45 కోట్లు కేటాయించారు. అక్కన్నపేట మండలం కట్కూర్‌ నుంచి అంతకపేట క్రాస్‌ రోడ్డుకు రూ.60లక్షలు, మల్లంపల్లి-చౌటపల్లి మార్గానికి 85 లక్షలు, హుస్నాబాద్‌ మండలం పందిల్ల స్టేజీ నుంచి పొట్లపల్లి మీదుగా హుస్నాబాద్‌ రోడ్డుకు రూ.కోటి మంజూరయ్యాయి. మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తయితే ఆయా మార్గాల్లో రాకపోకలు సజావుగా సాగనున్నాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని