logo

రైతులకు రూ.8.08 కోట్ల బకాయి

అన్నదాతల నుంచి ధాన్యం సేకరించి నగదు చెల్లిస్తున్న సర్కారు.. హమాలీ ఛార్జీలను పెండింగ్‌లో ఉంచుతోంది. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది రైతులు ఏటా వరి పండిస్తున్నారు. ఇందులో లక్ష మంది వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తూ మద్దతు ధర పొందుతున్నారు.

Published : 25 Jan 2022 01:53 IST

తప్పని ఎదురుచూపులు


ధాన్యాన్ని లారీల్లో ఎక్కించి.. రవాణాకు సిద్ధం చేస్తున్న హమాలీలు

న్యూస్‌టుడే, గజ్వేల్‌: అన్నదాతల నుంచి ధాన్యం సేకరించి నగదు చెల్లిస్తున్న సర్కారు.. హమాలీ ఛార్జీలను పెండింగ్‌లో ఉంచుతోంది. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది రైతులు ఏటా వరి పండిస్తున్నారు. ఇందులో లక్ష మంది వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తూ మద్దతు ధర పొందుతున్నారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు సమకూర్చుతున్న సర్కారు.. సుతిలి, హమాలీ ఛార్జీలు మాత్రం రైతులే చెల్లిస్తున్నారు. ధాన్యం తూకం వేసి.. బస్తాల్లో నింపి లారీల్లో ఎక్కించినందుకుగాను హమాలీలు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.40 వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా తీసుకుంటున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు సుమారు రూ.5.60 రైతులకు చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిన తరువాత నగదును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. దానితోపాటే హమాలీ ఛార్జీ చెల్లిస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. మూడేళ్లుగా బకాయిలు ఉండటంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో 2018 వానాకాలం నుంచి 2021 యాసంగి వరకు మొత్తం రూ.8,08,25,768లను చెల్లించాల్సి ఉంది. ‘పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతు ఖాతాల్లో జమ చేయిస్తామని’ జిల్లా పౌరసరఫరాల అధికారి హరీశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని