logo

స్వచ్ఛతే లక్ష్యంగా..

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణం స్వచ్ఛతలో మెరిసేలా బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా, బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక బాలికల విద్యాసౌధంలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలిక ఛైర్మన్‌ రాజమౌళి, కమిషనర్‌ వెంకట్‌గోపాల్‌ చొరవతో

Published : 25 Jan 2022 01:53 IST

గజ్వేల్‌ బాలికల విద్యాసౌధంలో శానిటరీ నాప్‌కిన్‌ వెండింగ్‌, డిస్పోజబుల్‌ యంత్రం ఏర్పాటు
ట్విట్టర్‌లో అభినందించిన కేటీఆర్‌

విద్యాసౌధం నిర్వాహకులకు పరికరాలు అప్పగించిన  బల్దియా ఛైర్మన్‌ రాజమౌళి తదితరులు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణం స్వచ్ఛతలో మెరిసేలా బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా, బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక బాలికల విద్యాసౌధంలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలిక ఛైర్మన్‌ రాజమౌళి, కమిషనర్‌ వెంకట్‌గోపాల్‌ చొరవతో శానిటరీ వెండింగ్‌, డిస్పోజబుల్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడే కాకుండా పట్టణంలో నాలుగు చోట్ల మహిళల సౌకర్యార్థం వాటిని ఏర్పాటు చేశారు. రూ.5 నాణెం వేయగానే నాప్‌కిన్‌ వచ్చే యంత్రంతో పాటు వినియోగించిన దాన్ని కాల్చివేసే మరో యంత్రాన్ని బిగించారు. ఇప్పటికే పురపాలికలో నాప్‌కిన్ల వంటివి వేసేందుకు ఎర్ర డబ్బాలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వ పాఠశాలలో సదరు యంత్రాన్ని బిగించిన విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్‌డన్‌ మున్సిపాలిటీ అంటూ అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని