logo

ఎట్టకేలకు నిధులు

జిల్లాలోనే పెద్ద పట్టణాల్లో ఒక్కటైన జహీరాబాద్‌లో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పట్టణంలోని ఏ వీధిలో చూసినా గుంతలమయంగా మారిన అంతర్గత దారులే దర్శనమిస్తున్నాయి. మురుగు కాల్వలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పట్టణ ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు.

Published : 25 Jan 2022 02:13 IST

జహీరాబాద్‌లో రూ.2.62 కోట్లతో రోడ్లు, మురుగు కాల్వలు

ఆదర్శనగర్‌లో మట్టి రోడ్డు

న్యూస్‌టుడే, జహీరాబాద్‌: జిల్లాలోనే పెద్ద పట్టణాల్లో ఒక్కటైన జహీరాబాద్‌లో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పట్టణంలోని ఏ వీధిలో చూసినా గుంతలమయంగా మారిన అంతర్గత దారులే దర్శనమిస్తున్నాయి. మురుగు కాల్వలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పట్టణ ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. మురుగు రోడ్లపైనే పారుతోంది. ఎట్టకేలకు ప్రజల ఇక్కట్లు కొంతమేరకైనా తీరనున్నాయి. వివిధ వార్డుల్లో సిమెంటు దారులు, మురుగు కాల్వల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. వివిధ పథకాల ద్వారా ఇటీవల మంజూరైన రూ.2.62 కోట్లతో ఆయా పనులు చేపడుతున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో దశాబ్దాలుగా జహీరాబాద్‌ పట్టణ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంతమేరకైనా దూరం కానున్నాయి.

ప్రతిపాదిత పనులు ఇవే..
* 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో ఆదర్శనగర్‌ కాలనీలో సిమెంటు రోడ్లు, రూ.27 లక్షలతో రాచన్నపేటలోని శ్మశాన వాటిక వద్ద రహదారి, రూ.28.50 లక్షలతో చెన్నారెడ్డినగర్‌, ఆదర్శనగర్‌లో సిమెంటు దారులు, రూ.35.50 లక్షలతో మాణిక్‌ప్రభు వీధిలో మురుగు కాల్వ, కల్వర్టు, బసవేశ్వర వీధి, మహతాబ్‌బాగ్‌, చెన్నారెడ్డినగర్‌ పార్కుకు సిమెంటు రోడ్లు, రూ.27 లక్షలతో కరీం కాలనీ, 14వ వార్డులో మురుగు కాల్వ, సిమెంటు దారుల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.14 లక్షలతో ఎస్‌బీహెచ్‌ కాలనీలో మురుగు కాల్వ, శ్రీనగర్‌కాలనీలో కల్వర్టు, రూ.8 లక్షలతో బసవేశ్వరవీధిలోని శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు.
* పట్టణ ప్రగతి నిధులు రూ.10 లక్షలతో 11వ వార్డులోని సంతోషిమాత ఆలయం సమీపంలో మురుగు కాల్వ, రూ.10 లక్షలతో 3వ వార్డులో సిమెంటు రోడ్లు, రూ.10 లక్షలతో 9వ వార్డులో సిమెంటు రోడ్లు, రూ.7.50 లక్షలతో రామ్‌నగర్‌లో సిమెంటు రోడ్డు, రూ.10 లక్షలతో 12వ వార్డులో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు ఇటీవల శంకుస్థాపన చేశారు.
* 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.25 లక్షలతో బస్టాండు సమీపంలో సిమెంటు రోడ్డు, చిన్న హైదరాబాద్‌లో సిమెంటు రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని