logo

నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవం

జిల్లా కేంద్రం మెదక్‌లో గణతంత్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక సమీకృత కలెక్టరేట్‌లో ఉదయం పది గంటలకు పాలనాధికారి హరీష్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, డా.బీఆర్‌

Updated : 27 Jan 2022 04:40 IST

కలెక్టరేట్‌లో జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తున్న పాలనాధికారి హరీష్‌, అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌

మెదక్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం మెదక్‌లో గణతంత్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక సమీకృత కలెక్టరేట్‌లో ఉదయం పది గంటలకు పాలనాధికారి హరీష్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పుష్పాంజలి అర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం వేడుకలను నిర్వహించారు. పది నిమిషాల్లోనే కార్యక్రమం పూర్తి కావడం గమనార్హం. అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, శిక్షణ కలెక్టర్‌ అశ్వని, జిల్లా అధికారులు శ్రీనివాస్‌, రమేశ్‌కుమార్‌, జయరాజ్‌, కృష్ణమూర్తి, పరశురాం నాయక్‌, తరుణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, రాజిరెడ్డి,  విజయశేఖర్‌రెడ్డి, గంగయ్య, వెంకటేశ్వర్‌రావు, శాంతికుమార్‌, రాజిరెడ్డి, డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ రోహిణిప్రియదర్శిని

ప్రజలతో మమేకం కావాలి: ఎస్పీ
పోలీసు ఉద్యోగం రావడం అదృష్టం.. ప్రజలతో మమేకమై, వారి ఆదరాభిమానాలను పొందాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయుల త్యాగం వల్ల స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. అకింతభావంతో పనిచేసి ప్రజల్లో మంచి పేరు సాధించినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. డీఎస్పీ సైదులు, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావు, సూరపునాయుడు పాల్గొన్నారు.


సంగారెడ్డిలో గణతంత్ర వేడుకలు

జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం కొవిడ్‌ నిబంధనల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో పాలనాధికారి హనుమంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పాలనాధికారి ప్రసంగం లేకుండానే కార్యక్రమాన్ని పూర్తిచేయడం గమనార్హం. ఎస్పీ రమణకుమార్‌, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి రాధికారమణి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎం.రమణకుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు, ఏఆర్‌డీఎస్పీ జనార్దన్‌, ఎస్‌బీ సీఐ మహేశ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, అర్బన్‌


మహనీయుల బాటలో నడుద్దాం

అదనపు పాలనాధికారి ముజమ్మిల్‌ఖాన్‌
కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవం

కలెక్టరేట్‌లో జెండా వందనం చేస్తున్న అదనపు పాలనాధికారులు ముజమ్మిల్‌ఖాన్‌, శ్రీనివాస్‌రెడ్డి,

జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, సీపీ శ్వేత, ఐఏఎస్‌ శిక్షణార్థి ప్రఫుల్‌దేశాయ్‌

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్రం పోరాటంలో అమరులైన మహనీయులను స్మరించాలని, వారి బాటలో నడవాలని జిల్లా అదనపు పాలనాధికారి ముజమ్మిల్‌ఖాన్‌ ఆకాంక్షించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారు అందించిన సేవలను కొనియాడారు. మనందరికి పండుగ రోజు అని, ప్రపంచంలో అతిగొప్ప సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా నిలిపేందుకు డా. బీఆర్‌ అంబేడ్కర్‌ సారథ్యంలో 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల అడుగుడుజాడల్లో ముందుకు సాగాలన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, పోలీసు కమిషనర్‌ శ్వేత, డీఆర్వో చెన్నయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని