logo

అప్పు ఇచ్చినవారు అవమానించడంతో...

అప్పు ఇచ్చినవారు అందరూ చూస్తుండగానే తీవ్రంగా అవమానించడంతో వరి కోత యంత్రం చోదకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌

Published : 27 Jan 2022 01:43 IST

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: అప్పు ఇచ్చినవారు అందరూ చూస్తుండగానే తీవ్రంగా అవమానించడంతో వరి కోత యంత్రం చోదకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాలు.. గంగాపూర్‌ గ్రామానికి చెందిన తిరుపతి వరి కోత యంత్రానికి విఠలాపూర్‌కు చెందిన బాదరబోయిన రాజు (40) చోదకుడిగా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం తిరుపతి వద్ద కొంత సొమ్మును రాజు అప్పుగా తీసుకున్నాడు. గడువుకు ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం తిరుపతి, గ్రామస్థుడు అంజయ్యతో కలిసి రాజుతో గొడవ పడ్డారు. అదే రోజు మధ్యాహ్నం గ్రామంలోని ఓ హోటల్‌ వద్ద అంతా చూస్తుండగా రాజును అంజయ్య చెప్పుతో కొట్టాడు. దీనిని అవమానంగా భావించిన రాజు ఇంటికెళ్లి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. అతడికి భార్య తార, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె ఫిర్యాదు చేయగా ఆత్మహత్యకు ప్రోత్సహించారని నిందితులు అంజయ్య, తిరుపతిపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ దేవారెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని