logo

కుటుంబ కలహాలతో రైతు బలవన్మరణం

ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో కలహాలు తరచుగా జరుగుతుండటంతో ఆవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొండపాకలో జరిగింది. కుకునూరుపల్లి ఎస్‌ఐ

Updated : 29 Jan 2022 01:43 IST

న్యూస్‌టుడే, కొండపాక: ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో కలహాలు తరచుగా జరుగుతుండటంతో ఆవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొండపాకలో జరిగింది. కుకునూరుపల్లి ఎస్‌ఐ పుష్పరాజ్‌ తెలిపిన వివరాలు.. కొండపాకకు చెందిన రైతు గునిశెట్టి వీరేశం(46)కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సుమారు నాలుగెకరాల పొలం ఉంది. పిల్లలకు పెళ్లీడు వయసు వచ్చింది. పంట వేసినా దిగుబడులు అనుకున్నంతగా రాక, కుటుంబ పోషణకు సరిపోక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. తరచుగా ఇంట్లో ఈ విషయమై గొడవలు అవుతున్నాయి. ఐదు రోజుల క్రితం మరోసారి కుటుంబ సభ్యులు ఒకరినొకరు దూషించుకోగా ఆయన పొలానికి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి వారికి రూ.20 వేల ఆర్థిక సాయం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని