logo

కష్టపడితేనే ఉజ్వల భవిత

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ సూచించారు. గురువారం మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు

Published : 20 May 2022 01:15 IST

మెదక్‌, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ సూచించారు. గురువారం మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో పది విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కష్టపడితే ఉజ్వలమైన భవిత సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కఠోర సాధన చేయాలని చెప్పారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని తెలిపారు. అనంతరం జాతీయ ఉత్తమ స్పీకర్‌ అవార్డు గ్రహీత సాయిరాహుల్‌రెడ్డి విద్యార్థుల్లో భయం పోగొట్టేలా, స్ఫూర్తి నింపేలా సందేశం ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎంఈవో నీలకంఠం, ప్రధానోపాధ్యాయురాలు రేఖ, ఉపాధ్యాయులు దేశపతి కృష్ణమూర్తి, మల్లారెడ్డి, పూర్ణచందర్‌, రవీందర్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని