logo

అన్ని రకాల వడ్లు కొంటాం: డీసీఎస్‌ఓ

రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల సంస్థ (డీసీఎస్‌ఓ) అధికారి హరీశ్‌ స్పష్టం

Published : 20 May 2022 01:15 IST

సిద్దన్నపేట కొనుగోలు కేంద్రంలో ఆరా తీస్తున్న హరీశ్‌

నంగునూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల సంస్థ (డీసీఎస్‌ఓ) అధికారి హరీశ్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన మండల పరిధి సిద్దన్నపేటలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అని రైతులను ప్రశ్నించగా.. లారీల కొరత తీవ్రంగా ఉందని బదులిచ్చారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ధాన్యంతో పాటు టార్పాలిన్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ భూపతి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రాగుల సారయ్య, ఎంపీటీసీ సభ్యుడు తిరుపతి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని