logo

2019-వాహన చట్టం రద్దు చేయాలని నిరసన

2019-వాహన చట్టాన్ని రద్దు చేయాలని, ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ పేరిట తీసుకువచ్చిన జీవో 714ను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, తెరాసవి జిల్లా

Published : 20 May 2022 01:15 IST

జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ..

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: 2019-వాహన చట్టాన్ని రద్దు చేయాలని, ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ పేరిట తీసుకువచ్చిన జీవో 714ను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, తెరాసవి జిల్లా అధ్యక్షుడు అరవింద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తా నుంచి జిల్లా రవాణా శాఖ కార్యాలయం వరకు ఆటోల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రవాణా రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. నూతన వాహన చట్టం పేరిట రోడ్‌ సేప్టీ బిల్లు పేరుతో అధికంగా చలాన్లు విధిస్తూ చోదకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చమురు ధరలు తగ్గించాలని, బ్యాడ్జి నంబరు పునరుద్ధరణపై జరిమానా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారి దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ, తెరాసకేవీ నాయకులు రవికుమార్‌, శ్రీనివాస్‌, కిట్టు, భాస్కర్‌, తిరుపతి, కరీం, కిషన్‌, ఆంజనేయులు, సాదిక్‌, రాఘవులు, పాషా, సురేందర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని