logo

రక్తనిధి.. ఖాళీ!

నర్సాపూర్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అత్యవసర సమయాల్లో రక్తం కావాలంటే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇక్కడి కేంద్రంలో రక్తం నిల్వ ఉంచకుండా అవసరమైనప్పుడు మెదక్‌ నుంచి తెప్పిస్తుండటం గమనార్హం. 2019, ఏప్రిల్‌లో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి.. అవసరమైన పరికరాలు సమకూర్చారు. ఆరంభం నుంచి నేటి వరకూ 176

Published : 21 May 2022 01:26 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌

కేంద్రంలో పరికరాలు ఇలా...

ర్సాపూర్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అత్యవసర సమయాల్లో రక్తం కావాలంటే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇక్కడి కేంద్రంలో రక్తం నిల్వ ఉంచకుండా అవసరమైనప్పుడు మెదక్‌ నుంచి తెప్పిస్తుండటం గమనార్హం. 2019, ఏప్రిల్‌లో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి.. అవసరమైన పరికరాలు సమకూర్చారు. ఆరంభం నుంచి నేటి వరకూ 176 మందికి రక్తం అందించారు. ప్రస్తుతం మెదక్‌ నుంచి ఇక్కడికి తరలించి అవసరమైన రోగులకు ఎక్కిస్తున్నారు.  

అత్యవసర సమయాల్లో అవస్థలు..
నిత్యం నర్సాపూర్‌ దవాఖానాకు 350 నుంచి 450 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా వంద మంది వరకు చేరుతున్నారు. సంత రోజు శుక్రవారం రోగుల సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. వీరే కాకుండా నిత్యం ప్రసవాలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 16 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. నర్సాపూర్‌, శివ్వంపేట, కౌడిపల్లి, హత్నూర, కొల్చారం, వెల్దుర్తి, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌ మండలాలతో పాటు పక్కనే ఉన్న తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల, జిన్నారం మండలాల నుంచి రోగులు తరలివస్తున్నారు. ఇక్కడ రక్తం అందుబాటులో ఉంచకపోడంతో అత్యవసర సమయాల్లో మెదక్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని రోగులు బంధవులు వాపోతున్నారు. అవసరం ఉన్న వారు నేరుగా మెదక్‌కు వెళ్లడం, లేదంటే సిబ్బంది వెళ్లి తీసుకురావడం జరుగుతోంది. వాస్తవానికి ఇక్కడి కేంద్రంలో 50 ప్యాకెట్ల వరకూ నిల్వ చేసే అవకాశం ఉంది.


వేసవి కావడంతో..
- డాక్టర్‌ మీర్జాబేగ్‌,  ఆస్పత్రి పర్యవేక్షకులు

ప్రస్తుతం వేసవి నేపథ్యంలో రక్తం నిల్వ ఉంచడం లేదు. అవసరం ఉన్న వారికి ఒక రోజు ముందుగా మెదక్‌ నుంచి తెప్పిస్తున్నాం. నిల్వ చేసిన రక్తం 30 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత పనికి రాకుండా పోతుంది. ఎవరైనా రక్తదానం చేసినా ఇక్కడ నిల్వ చేసే అవకాశం ఉండదు. నేరుగా మెదక్‌లోని కేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. అక్కడ పరీక్షలు నిర్వహించాక.. అవసరమైతేనే ఇక్కడికి పంపుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని