logo

పైలేరియా బాధితులు 1861 మంది...

రానున్న వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా

Published : 21 May 2022 01:26 IST

జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు


సామగ్రి పంపిణీ చేస్తున్న వెంకటేశ్వర్‌రావు, తదితరులు

పాపన్నపేట, న్యూస్‌టుడే: రానున్న వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఫైలేరియా వ్యాధిగ్రస్థులకు అవగాహన కల్పించారు. దోమకాటుతో బోధకాలు, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతోనే కీటక జనిత వ్యాధులను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని, దోమ తెరలను వాడాలని చెప్పారు. జిల్లాలో 1861 మంది పైలేరియా బాధితులున్నారని, వారిలో రెండు, మూడు దశల్లో ఉన్న వారు వెయ్యి మందికి పైగా ఉన్నారన్నారు. వారిపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. అంతకుముందు బోదకాలకు సంబంధించిన వివిధ రకాల సామగ్రి పలువురికి అందజేశారు. ఏఎంవో కుమారస్వామి, మండల వైద్యాధికారి హరిప్రసాద్‌, సీహెచ్‌వో చందర్‌, సర్పంచి గురుమూర్తిగౌడ్‌, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌, సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, సూపర్‌వైజర్‌ అలీ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని