logo

తూప్రాన్‌లో కోర్టు ఏర్పాటుకు సన్నాహాలు

వచ్చే నెల 2న తూప్రాన్‌లో కొత్త కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి మారుతిదేవి అన్నారు. శుక్రవారం తూప్రాన్‌లో కోర్టు ఏర్పాటుకు ప్రాథమిక పాఠశాల సమీపంలోని పాత వసతిగృహాన్ని ఆమె

Published : 21 May 2022 01:26 IST

పుట్టకోటలో భవనాన్ని పరిశీలిస్తున్న ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి మారుతిదేవి

తూప్రాన్‌, న్యూస్‌టుడే: వచ్చే నెల 2న తూప్రాన్‌లో కొత్త కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి మారుతిదేవి అన్నారు. శుక్రవారం తూప్రాన్‌లో కోర్టు ఏర్పాటుకు ప్రాథమిక పాఠశాల సమీపంలోని పాత వసతిగృహాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ న్యాయస్థానం పరిధిలోనే తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కోర్టు పునర్విభజనలో భాగంగా తూప్రాన్‌లో సైతం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సరైన భవనం కోసం పరిశీలిస్తున్నామని, సన్నాహాలు షురూ చేశామని తెలిపారు. అనంతరం ఆమె తూప్రాన్‌ సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌లతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆనంద్‌బాబు, రెవెన్యూ సిబ్బంది నాగరాజు, వేణు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని