logo

పేలిన సిలిండర్‌.. తప్పిన ప్రమాదం!

మండలంలోని చీలేమామిడిలో శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్‌ సిలిండరు పేలిన ఘటనలో పేను ప్రమాదం తప్పింది. గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం... జనుముల సంగన్న ఇంట్లో సిలిండరు వాచర్‌ పనిచేయక గ్యాస్‌ లీకైంది.

Published : 21 May 2022 01:26 IST

గ్యాస్‌ సిలిండర్‌కు అంటుకున్న మంటలు

ఝరాసంగం: మండలంలోని చీలేమామిడిలో శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్‌ సిలిండరు పేలిన ఘటనలో పేను ప్రమాదం తప్పింది. గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం... జనుముల సంగన్న ఇంట్లో సిలిండరు వాచర్‌ పనిచేయక గ్యాస్‌ లీకైంది. ఇంటినిండా గ్యాస్‌ వ్యాపించి కరెంటు షార్ట్‌సర్య్కూట్‌తో సిలిండరుకు మంటలు అంటుకుని పేలడంతో గోడలకు బీటలు వచ్చాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని