logo

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రానున్న 30, 40 ఏళ్ల వరకు సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేశారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం

Published : 21 May 2022 01:26 IST

గౌరాయపల్లిలో భూగర్భ మురుగుకాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి

చేర్యాల, మద్దూరు, న్యూస్‌టుడే: స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రానున్న 30, 40 ఏళ్ల వరకు సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేశారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరులోఎంపీపీ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రం ప్రశంసిస్తుంటే ఇక్కడి భాజపా నాయకులు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మన రాష్ట్రం వివిధ పన్నుల రూపంలో రూ.3.67 లక్షల కోట్లు చెల్లిస్తుండగా.. కేంద్రం తిరిగిచ్చేది  కేవలం రూ.లక్ష కోట్లు మాత్రమేనన్నారు. సమావేశానికి ఆలస్యంగా హాజరైన ధూల్మిట్ట తహసీల్దారు అశోక్‌ను ఎమ్మెల్యే ప్రశ్నిస్తూ ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. తహసీల్దారు నరేందర్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.  కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలో భూగర్భ మురుగుకాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చేర్యాల మండలం వీరన్నపేటలో ఇటీవల తాటిచెట్టుపై నుంచి పడి చనిపోయిన ఆరెళ్ల రవీందర్‌ కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సభ్యుడు సిలివేరు సిద్దప్ప, గీస బిక్షపతి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని