logo

స్త్రీనిధి రుణం.. మహిళాభ్యున్నతికి మార్గం

పొదుపు సంఘాల్లో చేరుతూ మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము దాచిన డబ్బుకు తోడు బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాము లవుతున్నారు. సంఘాల్లోని

Published : 21 May 2022 01:26 IST

ఈ ఏడాది పంపిణీ లక్ష్యం రూ.190 కోట్లు  
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

మహిళా సంఘం సమావేశం

పొదుపు సంఘాల్లో చేరుతూ మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము దాచిన డబ్బుకు తోడు బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాము లవుతున్నారు. సంఘాల్లోని సభ్యులకు రుణాలు సైతం సులభంగా అందుతున్నాయి. వాయిదాలు సక్రమంగా చెల్లించడమే దీనికి కారణం. ఈ ఆర్థిక సంవత్సరం స్త్రీనిధి రుణ లక్ష్యాలను ఖరారు చేసిన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

1.90 లక్షల మంది సభ్యులు
జిల్లాలో 692 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు 18,795. ఆయా
సంఘాల్లో 1.90 లక్షల మంది సభ్యులున్నారు. అర్హత గల వారందరినీ సంఘాల్లో చేర్పించేందుకు కొత్తవాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.

ప్రారంభం నుంచే..
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏదైనా గ్రామైక్య సంఘం పరిధిలో సాంకేతిక సమస్యలు ఉంటే, రుణాల పంపిణీ వేగవంతమయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని భావిస్తున్నారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో ముందుకుసాగుతూ ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలను అదే నెలలో పూర్తిచేసేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు.


గతేడాది కంటే రూ.45 కోట్లు అధికం
పొదుపు మహిళలకు స్త్రీనిధి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.190.90 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది కంటే రూ.45 కోట్లు ఎక్కువ. రుణాల పంపిణీ ప్రక్రియ వేగవంతం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.


ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం..
-మోహన్‌రెడ్డి, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్‌

రుణ పంపిణీ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రణాళికతో ముందుకుసాగుతాం. అధికారులు, సిబ్బంది అన్న తేడాలేకుండా సమష్టిగా వ్యవహరిస్తాం. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ లోపాలను సరిదిద్దుకుంటాం. బ్యాంకు రుణాలకు తోడు స్త్రీనిధి రుణాలు తీసుకోవడంతోపాటు సద్వినియోగంపై మహిళలకు అవగాహన పెంపొందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని