logo

గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చూడండి

రక్తహీనతతొ ఎవరూ ఇబ్బందులు పడొద్దని, అలాంటి వారుంటే వెంటనే గుర్తించి సకాలంలో వారికి ముందులు అందజేయాలని ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.గర్భిణుల్లో రక్తహీనతలు లేకుండా

Published : 21 May 2022 01:26 IST

జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి

పుల్కల్‌ పీహెచ్‌సీలో దస్త్రాలు పరిశీలిస్తున్న గాయత్రీదేవి

జోగిపేట, న్యూస్‌టుడే: రక్తహీనతతొ ఎవరూ ఇబ్బందులు పడొద్దని, అలాంటి వారుంటే వెంటనే గుర్తించి సకాలంలో వారికి ముందులు అందజేయాలని ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.గర్భిణుల్లో రక్తహీనతలు లేకుండా చూడాలని శుక్రవారం పుల్కల్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనా టీకాలు, ఎంసీబీ కార్డుల వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన వారందిరికి టీకాలు వేయాలని, రెండోడోసు తీసుకోని వారిని గుర్తించి వేయాలని కోరారు. పీహెచ్‌సీలో దస్త్రాలు పరిశీలించి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో వైద్యాధికారి నృపేన్‌ చక్రవర్తి ఏఎన్‌ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.

31న సదరం శిబిరం
సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈనెల 31న సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీ దేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌  చేసుకుని హాజరుకావాలని సూచించారు.   ఈనెల 25 నుంచి స్లాట్‌ బుక్‌ చేసుకొనే అవకాశం కల్పించినట్లు  ఆమె వివరించారు.

పటాన్‌చెరులో ఒకరికి కరోనా..: పటాన్‌చెరులో శుక్రవారం ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్లు గాయత్రీదేవి పేర్కొన్నారు. కేసులు తగ్గాయని నిర్లక్ష్యం చేయవద్దని  జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని