logo

వరి కోతకు వెళ్లి.. విగతజీవిగా మారి..

వరి కోద్దామని వెళ్లిన కోత యంత్రం చోదకుడు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన ఘటన నార్సింగిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నర్సింలు తెలిపిన వివరాలు.. కొల్చారం మండలం వై.మాందాపూర్‌ గ్రామానికి చెందిన

Published : 22 May 2022 02:31 IST

వెంకట్‌యాదవ్‌

నార్సింగి (చేగుంట), న్యూస్‌టుడే: వరి కోద్దామని వెళ్లిన కోత యంత్రం చోదకుడు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన ఘటన నార్సింగిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నర్సింలు తెలిపిన వివరాలు.. కొల్చారం మండలం వై.మాందాపూర్‌ గ్రామానికి చెందిన లింగాపూర్‌ వెంకట్‌యాదవ్‌ (26) వరి కోత యంత్రం డ్రైవరుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం నార్సింగిలో ఉప్పలయ్యకు చెందిన వరి పొలంలో పంట కోసేందుకు యంత్రంతో వెళ్లాడు. ముందుగా సహ డ్రైవరు శ్రీనివాస్‌ కొంత భాగం కోశాడు. టిఫిన్‌ చేసి వచ్చిన వెంకట్‌యాదవ్‌ మరికొంత పొలాన్ని కోసేందుకు యంత్రం ఎక్కాడు. వరి కోస్తుండగా అడ్డుగా 11 కేవీ విద్యుత్తు తీగలు ఉండటాన్ని గమనించాడు. సహ డ్రైవరు శ్రీనివాస్‌, రైతు ఉప్పలయ్యలు విద్యుత్తు సరఫరా నిలిపివేయించినట్లు తెలిపారు. దీంతో వెంకటయాదవ్‌ వాటిని పైకి లేపేందుకు చేతులతో పట్టుకోగానే విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. అక్కడున్న వారు వెంటనే నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. మృతుడికి ఏడాది క్రితం నాగరాణితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని