logo

మోక్షిత్‌కు కన్నీటి వీడ్కోలు

మృత్యుఒడిని చేరి అవయవాలు దానం చేసిన ఇంటర్‌ విద్యార్థి మోక్షిత్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. మెదక్‌ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్‌,

Published : 22 May 2022 02:31 IST

నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

మెదక్‌, న్యూస్‌టుడే: మృత్యుఒడిని చేరి అవయవాలు దానం చేసిన ఇంటర్‌ విద్యార్థి మోక్షిత్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. మెదక్‌ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్‌, జ్యోతి దంపతుల కుమారుడు మోక్షిత్‌ శుక్రవారం బ్రెయిన్‌డెడ్‌ కాగా, అతడి అవయవాల దానంతో తొమ్మిది మందికి పునర్జన్మ ఇచ్చిన విషయం విదితమే. శనివారం ఉదయం మోక్షిత్‌ మృతదేహం మెదక్‌కు చేరుకోగానే స్థానిక నర్సాపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు నివాళులు అర్పించారు. నర్సాపూర్‌ క్రాస్‌రోడ్డు నుంచి స్థానిక వాసవినగర్‌ కాలనీ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించగా, మృతదేహం ఉన్న అంబులెన్స్‌ వెంట నడిచింది. అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ, పురపాలిక ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌, తెరాస నాయకులు రాగి అశోక్‌, మధుసూదన్‌ రావు, దుర్గాప్రసాద్‌, శివరామకృష్ణ, శంకర్‌, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు లక్ష్మిపతి, కొండ శ్రీను, చకిలం శ్రీనివాస్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆర్యవైశ్య శ్మశానవాటికలో ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు చేపట్టారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని