logo

జూన్‌ 1న హుస్నాబాద్‌లో 5కే రన్‌..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 1న హుస్నాబాద్‌ పట్టణంలో 30 సంవత్సరాల పైబడిన మహిళలతో 5 కే రన్‌ నిర్వహించనున్నట్లు సీపీ శ్వేత తెలిపారు. సంబంధిత గోడపత్రికలను సిద్దిపేట సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

Published : 22 May 2022 02:31 IST

గోడపత్రికల ఆవిష్కరణలో సీపీ శ్వేత, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు

సిద్దిపేట, హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 1న హుస్నాబాద్‌ పట్టణంలో 30 సంవత్సరాల పైబడిన మహిళలతో 5 కే రన్‌ నిర్వహించనున్నట్లు సీపీ శ్వేత తెలిపారు. సంబంధిత గోడపత్రికలను సిద్దిపేట సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా ఎమ్మెల్యే సతీశ్‌ బహుమతులు ప్రకటించారన్నారు. ప్రథమ - రూ.లక్ష, ద్వితీయ- రూ.60 వేల నగదు బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. మహిళలు ఆరోగ్య రక్షణపై దృష్టి సారించాలన్నారు. హుస్నాబాద్‌ పురపాలిక అధ్యక్షురాలు రజిత, ఉపాధ్యక్షురాలు అనితారెడ్డి, కౌన్సిలర్లు సహా సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐలు ఉన్నారు.
ప్రజల రక్షణకు ప్రతిన : ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా సీపీ కార్యాలయంలో శ్వేత, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంఘ విద్రోహశక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు డీసీపీ మహేందర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ఫణీందర్‌, ఏవో సవిత, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌, సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌.. : ఈ నెల 23వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా నిర్దేశిత 83 కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్‌ అమలు కొనసాగుతుందన్నారు. పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని