logo

ప్రభుత్వ నిర్వాకంతో కర్షకులకు కష్టాలు

ప్రతి ధాన్యం గింజ కొంటామని చెప్పి, కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారు. ఫలితంగా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు నానా తంటాలు పడుతున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వాపోయారు. తెలంగాణ

Published : 22 May 2022 02:31 IST

రచ్చబండలో మాజీ మంత్రి పొన్నాల

కొమురవెల్లిలో రైతులతో మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య

చేర్యాల, న్యూస్‌టుడే: ప్రతి ధాన్యం గింజ కొంటామని చెప్పి, కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారు. ఫలితంగా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు నానా తంటాలు పడుతున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వాపోయారు. తెలంగాణ రాష్ట్ర సంపదను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కొమురవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబం భూ కబ్జాలకు తెరలేపితే.. అవే అక్రమాలను స్థానిక ఎమ్మెల్యే కూడా చేస్తూ అమాయక ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నయీం ఆస్తులను ఎవరు స్వాహా చేశారో, మియాపూర్‌ భూముల్లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌.. వరి వేస్తే ఉరే అనడంతో చాలా మంది రైతులు పొలాలన్నీ బీళ్లుగా వదిలేశారన్నారు. అంతకుముందు ఆయన కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమాల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వకులాభరణం నర్సయ్య, కొమురవెల్లి మండలాధ్యక్షుడు బుడిగె గురువయ్య గౌడ్‌, మద్దూరు జడ్పీటీసీ సభ్యుడు గిరి కొండల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కొయ్యడ రాజమణి, లింగంపల్లి కవిత, నాయకులు శ్రీనివాస్‌, రవి, రాజయ్య, కరుణాకర్‌, రాజు, ఎల్లయ్య, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని