logo

తెరాస పాలనలో రైతులకు అన్యాయం: కాంగ్రెస్‌

రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం.. ప్రతిగింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం.. వారికి తీరని ద్రోహం చేశారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు, మాజీ మంత్రి డాక్టర్‌ జె.గీతారెడ్డి ఆరోపించారు. తెరాస పాలనలో అన్నదాతలు

Published : 22 May 2022 02:31 IST

న్యాల్‌కల్‌లో జరిగిన రచ్చబండ సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గీతారెడ్డి

న్యాల్‌కల్‌ న్యూస్‌టుడే: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం.. ప్రతిగింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం.. వారికి తీరని ద్రోహం చేశారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు, మాజీ మంత్రి డాక్టర్‌ జె.గీతారెడ్డి ఆరోపించారు. తెరాస పాలనలో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారన్నారు. శనివారం న్యాల్‌కల్‌లో జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకేనన్నారు. అన్నదాతలకు భరోసా కల్పించేందుకు  రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే తెరాస చేతులెత్తేసిందని ఆమె విమర్శించారు. పార్టీ నేతలు శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సిద్ధిలింగయ్యస్వామి, రాజేష్‌, బాద్‌ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని