logo

బడులు తెరిచేలోపు అభివృద్ధి పనులు పూర్తి

మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదని పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో మన ఊరు-మన బడి, దళితబంధు, పల్లె ప్రగతి, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు

Published : 22 May 2022 02:31 IST

 పల్లె ప్రగతికి సిద్ధం కావాలి

అధికారులతో సమీక్షలో పాలనాధికారి 

మాట్లాడుతున్న హనుమంతరావు, చిత్రంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబురావు, పశు సంవర్ధక అధికారి వసంతకుమారి

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదని పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో మన ఊరు-మన బడి, దళితబంధు, పల్లె ప్రగతి, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు తదిత అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు తెరిచేలోపుగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గానికి రెండు చొప్పున ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం దాదాపు రూ.7వేల కోట్లు ఖర్చు పెడుతోందని తెలిపారు. అంచనా వ్యయం రూ.30 లక్షలు దాటితే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలను గడువులోగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. జూన్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో  అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. దళితబంధు పెండింగ్‌ యూనిట్ల గ్రౌండింగ్‌ ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నారు. పాడిగేదెల కొనుగోలు, షెడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబురావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి సునీత, పలువురు అధికారులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని