logo

దుర్గమ్మ దర్శనం.. భక్తజన పరవశం..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు రోజైన ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ

Published : 23 May 2022 02:15 IST

పాపన్నపేట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు రోజైన ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తెల్లవారుజామున 5 గంటలకు అర్చకులు పార్థివశర్మ, రాజశేఖర్‌ శర్మలు అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన చేపట్టి తదుపరి దర్శనం కల్పించారు. మంజీరా నదీపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మాతను దర్శించుకున్నారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో సార శ్రీనివాస్‌, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏడుపాయల ఔట్‌పోస్ట్‌ సిబ్బంది బందోబస్తు చేపట్టారు.

న్యాయమూర్తి పూజలు..
ఏడుపాయల ఆలయాన్ని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పాపిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్నాక ఈవో ఆలయ మర్యాదల ప్రకారం శాలువాతో సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని