logo

ఇంధనంపై రాష్ట్రం వ్యాట్‌ తగ్గించాలి: భాజపా

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను తగ్గించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే వ్యాట్‌ తగ్గించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో

Published : 23 May 2022 02:12 IST

సమావేశంలో మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను తగ్గించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే వ్యాట్‌ తగ్గించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలుజేస్తోందని దుయ్యబట్టారు. విద్యుత్తు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని, వెంటనే తగ్గించాలన్నారు. ఇక్కడ రైతులు అప్పులబాధ తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడితే బాధిత కుటుంబ సభ్యులను సీఎం ఏనాడు పరామర్శించలేదని విమర్శించారు. దేశంలో తన రాజకీయ ప్రాభల్యం కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం దారుణమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడంతో ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జిల్లా అధికార పార్టీ ప్రతినిధులు హరీశ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి,  యువ మోర్చా అధ్యక్షులు పవన్‌,  పట్టణ పార్టీ అధ్యక్షులు రవిశంకర్‌, నాయకులు రవీందర్‌రెడ్డి, సాయికుమార్‌, మల్లికార్జున్‌, వినోద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని