logo

51 రహదారుల మరమ్మతుకు రూ.55 కోట్లు

అందోలు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన 51 దారుల మరమ్మతుకు రూ.55.03 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ తెలిపారు. గురువారం అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 24 Jun 2022 02:26 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తదితరులు

జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: అందోలు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన 51 దారుల మరమ్మతుకు రూ.55.03 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ తెలిపారు. గురువారం అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌, అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాలకు రూ.17.13కోట్లు, సంగారెడ్డి జిల్లాలోని అందోలు, వట్‌పల్లి, రాయికోడ్‌, మునిపల్లి, పుల్కల్‌ మండలాలకు 37.90కోట్లు మంజూరు చేస్తు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరమ్మతు పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అంతర్గత దారులు, కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో మంజూరు కానున్నట్టు చెప్పారు. గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, తెరాస ప్రభుతం వచ్చాక దశలవారీగా సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు కానున్నట్టు తెలిపారు. అందోలు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో త్వరలోనే మార్క్‌ఫెడ్‌ ద్వారా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. 10వేల ఎకరాల్లో జొన్న వేశారని, రైతులు అధైర్యపడొద్దని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ నారాయణ, పుల్కల్‌ మండల తెరాస అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, వరం సంస్థ అధ్యక్షుడు వీరారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని