నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
ఖాజాపూర్‌లో నిఘా నేత్రాలను ప్రారంభిస్తున్న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్, చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: ఆపద సమయంలో డయల్ 100కు ఫోన్ చేయగానే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సమస్య పరిష్కరిస్తారని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గతంలో గ్రామంలో 8 సీసీ కెమెరాలను కావేరి పరిశ్రమ వారు ఏర్పాటు చేయించగా, సర్పంచి నాగలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు యాదగిరి, గ్రామస్థులు రూ.3 లక్షలతో 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. అనంతరం చిన్నశంకరంపేట ఠాణాను సందర్శించి రికార్డులను పరిశీలించారు. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ చంద్రశేఖర్, స్థానిక ఎస్ఐ సుభాష్‌గౌడ్, ఉపసర్పంచి ఉపేందర్‌రెడ్డి, మడూరు సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు..
మెదక్‌లోని పోలీసు పరేడ్ మైదానంలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డులు పరేడ్ నిర్వహించారు. దీన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించరాదని సూచించారు. సిబ్బంది తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. ఆరోగ్య, ఇతర సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. డీఎస్పీలు సైదులు, యాదగిరిరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ నాగేశ్వర్రావు, సూరపునాయుడు, సీఐలు మధు, శ్రీధర్, గోపీనాథ్, డీసీఆర్బీ సీఐ రవీందర్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dravid - Taylor : అడవిలో 4000 పులులు .. కానీ ఇక్కడ ద్రవిడ్ మాత్రం ఒక్కడే!
-
India News
RSS chief: యావత్ ప్రపంచం భారత్‌వైపే చూస్తోంది : మోహన్ భగవత్
-
Movies News
Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
-
Politics News
Raghunandan: ఏ చట్టం ప్రకారం మంత్రి కాల్పులు జరిపారు?: రఘునందన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News : కలిసుంటానని చెప్పి.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)