logo

కరెంటు కోతలు.. వినియోగదారుల వెతలు!

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. తరచూ ఏర్పడుతున్న విద్యుత్తు అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎంతసేపు ఉంటుందో చెప్పలేని పరిస్థితి తయారైంది. వానకాలం

Published : 25 Jun 2022 01:25 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలికలో అస్తవ్యస్తంగా సరఫరా

న్యూస్‌టుడే, గజ్వేల్‌

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. తరచూ ఏర్పడుతున్న విద్యుత్తు అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎంతసేపు ఉంటుందో చెప్పలేని పరిస్థితి తయారైంది. వానకాలం రాకతో విద్యుత్తు వినియోగం తగ్గినా కోతలు ఎందుకుంటున్నాయనే ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తోంది. ప్రతి రోజు ఉదయం, సాయత్రం కరెంటు కోతలు తీవ్రంగా ఉంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. 24 గంటలు విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. బల్దియాలో రోజూ కరెంటు పోతోంది. సాయంత్రం నాలుగు దాటిందంటే కోతులు షురూ అవుతున్నాయి. ఒక్కోసారి గంటల తరబడి రావడం లేదు. ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌ (వినియోగదారులు ఫోన్‌ ద్వారా తెలిపే) సమస్యలు తీర్చుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. రోజూ సమస్యలు తీర్చుతుంటే కరెంటు ఎందుకు పోతోందంటున్నారు. పురపాలికలో దాదాపు 55 వేల జానాభా ఉంది. దాదాపు 15 వేల గృహ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. 5 వేల దుకాణాలు, మరో 50 వరకు వివిధ చిన్న, మధ్యతరహా పరిశ్రమల కనెక్షన్లున్నాయి. అప్రకటితంగా కరెంటు కోతలు విధించటం వల్ల వినియోగదారులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిరాక్సు, ఎక్స్‌రే కేంద్రాలు, ఫొటో స్టూడియోలు, హోటళ్ల వ్యాపారాలు సాగటం లేదు. జనరేటర్లు, ఇన్వర్టర్లు వినియోగించే వారికి ఖర్చు అదనపు భారమవుతోంది. నిత్య రాబడిలో డీజిల్‌కు రూ.200 వరకు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. జీపీ బల్దియాకు విద్యుత్తు సరఫరా చేసేందుకు గజ్వేల్‌లోని 33 కేవీ ఉపకేంద్రంతో పాటు ప్రజ్ఞాపూర్‌లో మరో రెండు ఉపకేంద్రాలున్నాయి.

ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి

గజ్వేల్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌ వరకు విద్యుత్తు సరఫరా అయ్యే తీగలు ఎల్టీ లైన్లతోపాటు హెచ్‌టీ లైన్లు ఒకే స్తంభానికి ఉండటంతో విద్యుత్తు సమస్యలు ఏర్పడినప్పుడు రెండిటికీ నిలిపేస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడినప్పుడు దాని పరిధి వరకే విద్యుత్తు నిలిపేసే వ్యవస్థ రూపొందిస్తే ఇబ్బంది ఉండదు.


లోపాలు లేకుండా చూస్తాం

- ప్రభాకర్‌, జిల్లా ఎస్‌ఈ

ప్రభుత్వ సూచన మేరకు విద్యుత్తు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. జీపీ పురపాలికలో కరెంటు కోతలకు కారణాలేంటనే విషయాన్ని పరిశీలిస్తాం. వినియోగదారులకు మెరుగ్గా సరఫరా అయ్యేలా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని