logo

‘అన్ని రంగాల్లో గజ్వేల్‌ అభివృద్ధి’

తరతరాలుగా వెనకబాటుకు గురైన గజ్వేల్‌ నియోజకవర్గం కేసీఆర్‌ కృషితో దశ, దిశ మారి అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారిందని గజ్వేల్‌ నుంచి ఆయనను తప్ప మరొకరని ఇక్కడి ప్రజలు ఊహించుకోరని గజ్వేల్‌ ఏఎంసీ ఛైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌

Published : 25 Jun 2022 01:25 IST

గజ్వేల్‌, న్యూస్‌టుడే: తరతరాలుగా వెనకబాటుకు గురైన గజ్వేల్‌ నియోజకవర్గం కేసీఆర్‌ కృషితో దశ, దిశ మారి అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారిందని గజ్వేల్‌ నుంచి ఆయనను తప్ప మరొకరని ఇక్కడి ప్రజలు ఊహించుకోరని గజ్వేల్‌ ఏఎంసీ ఛైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం ఆయన గజ్వేల్‌లోని ఏఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తెలంగాణ ముఖచిత్రంలో నిలిపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. గతంలో కనీసం తాగునీళ్లకు నోచుకోని గజ్వేల్‌ ఈ రోజు ప్రగతి పథంలో దూసుకుపోతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయోగశాలగా మారిందన్నారు. కేసీఆర్‌ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం వల్లనే ఇదంతా సాధ్యమైందన్నారు. ఇక్కడ అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్‌, భాజపా నేతలు  కేసీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయబోరని, సత్యదూర ప్రచారం చేయటం సహించరానిదన్నారు.  సాధ్యమే కాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ్ల అభివృద్ధిలో దేశంలోనే ఆగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ పగటి కలలు కన్నా వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచే పోటీ చేస్తారని ఆయన నేతృత్వంలో  తెరాస అధికారంలోకి రావటం.. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్ణయాత్మక సూచనలు, సలహాలు ఇచ్చి అభివృద్ధి పనుల కోసం సహకరించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని