logo

ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి

దేశంలోనే ఆర్డీవో నుంచి అటెండర్‌ వరకున్న ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు హక్కు కల్పించిన రాష్ట్రం మనదేనని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్‌లోని

Published : 28 Jun 2022 01:11 IST

ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌

మెదక్‌లో శిక్షణార్థులకు పుస్తకాలు అందిస్తున్న దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే పద్మ తదితరులు

మెదక్‌ టౌన్‌, రామాయంపేట, న్యూస్‌టుడే: దేశంలోనే ఆర్డీవో నుంచి అటెండర్‌ వరకున్న ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు హక్కు కల్పించిన రాష్ట్రం మనదేనని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్‌లోని ఓ వేడుక మందిరంలో నిర్వహించిన ఉచిత ఉద్యోగ శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందని గుర్తుచేశారు. జిల్లాలోని కొల్చారానికి చెందిన మల్లినాథ సూరి దేశంలోని గొప్ప కవుల్లో ఒకరని, ఆయన వల్లే కాళిదాసుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమించాలన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న 60 రోజులు కష్టపడి చదివితే మిగతా 60 ఏళ్లు సంతోషంగా ఉంటామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నియోజకవర్గానికి చెందిన వారికి ఉద్యోగాలు వస్తేనే నాకు సంతృప్తి ఉంటుందన్నారు. పోలీసు ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఎస్పీ సహకారంతో దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్‌కు సైతం ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రైవేట్‌ శిక్షణ కేంద్రాలకు దీటుగా తర్ఫీదు ఇచ్చామన్నారు. అనంతరం శిక్షణార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పంపిణీ చేశారు. జడ్పీ అధ్యక్షురాలు హేమలత, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మెదక్‌ డీఎస్పీ సైదులు, పీజేఆర్‌ శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ జగదీశ్వర్‌ తదితరులున్నారు. రామాయంపేటలోనూ దేశపతి, పద్మాదేవేందర్‌రెడ్డిలు పోలీసు శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు పుస్తకాలు అందజేశారు. అదనపు ఎస్పీ బాలస్వామి నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేష్‌ తదితరులు ఉన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని