logo

మద్యం మత్తులో మహిళ దారుణహత్య

మద్యం మత్తులో మతిస్థిమితం లేని మహిళను అత్యాచారం చేసి హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దుండగులైన ఇద్దరు బిహార్‌ వలస కూలీలను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. సోమవారం సాయంత్రం పెద్దశంకరంపేట ఠాణాలో

Published : 28 Jun 2022 01:22 IST

 శివాయపల్లి కేసును ఛేదించిన పోలీసులు
 ఇద్దరు బిహార్‌ వలస కూలీల రిమాండ్‌

పెద్దశంకరంపేటలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డీఎస్పీ సైదులు, సీఐ జార్జ్‌, తదితరులు

పెద్దశంకరంపేట, న్యూస్‌టుడే: మద్యం మత్తులో మతిస్థిమితం లేని మహిళను అత్యాచారం చేసి హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దుండగులైన ఇద్దరు బిహార్‌ వలస కూలీలను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. సోమవారం సాయంత్రం పెద్దశంకరంపేట ఠాణాలో జరిగిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. మండలంలోని శివాయపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ (39) మూడేళ్ల క్రితం భర్తను వదిలేసింది. ఈ క్రమంలో గ్రామాల్లో తిరుగుతూ ఉండేది. ఈ నెల 16న రాత్రి 8 గంటల సమయంలో గ్రామ సమీపంలో ఉన్న మిల్లులో బిహార్‌ నుంచి మూడు నెలల క్రితం వచ్చిన వలస కూలీలు చెడిముఖియా, సజిత్‌రిషిదేవ్‌లు కల్లు తాగి రోడ్డు వెంట తిరుగుతున్నారు. మల్లికార్జున మిల్లు చౌరస్తాలోని గుడిసెలో ఉన్న సదరు మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించి శివాయపల్లి గ్రామం వైపు వెళ్లగా.. నిందితులు బలవంతంగా పక్కనున్న చేనులోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. విషయం బయట పడితే తాము దొరికిపోతామేమోనని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆమె శవాన్ని ఓ గొయ్యి తవ్వి పాతిపెట్టారు. తిరిగి నిందితులు మిల్లులో రూముకు వచ్చి మరునాడు మహారాష్ట్రకు పారిపోయారు. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయని భావించి మళ్లీ అదే మిల్లులో పనిలో చేరారు. 21న మహిళ మృతదేహం వెలుగు చూడగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారం జరిగిందని గుర్తించారు. ఈ క్రమంలో చెడిముఖియా, సజిత్‌రిషిదేవ్‌లు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు. కేసును వారంలో ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మెదక్‌ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జ్‌, మెదక్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐలు బాలరాజు, సత్యనారాయణ, లింగం తదితరులు ఉన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని