logo

రూ.8 లక్షలు కేటాయింపు.. వంతెన నిర్మాణం ప్రారంభం

చేర్యాల నుంచి నాగపురి వెళ్లే రహదారిపై కడవేర్గు శివారులో రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న లోలెవల్‌ కల్వర్టు సమస్యకు తాత్కాలిక పరిస్కారానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవ చూపారు. ‘ఈనాడు’లో జూన్‌ 28, 29 తేదీల్లో ప్రచురితమైన

Published : 30 Jun 2022 01:51 IST

కడవేర్గులో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు

చేర్యాల: చేర్యాల నుంచి నాగపురి వెళ్లే రహదారిపై కడవేర్గు శివారులో రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న లోలెవల్‌ కల్వర్టు సమస్యకు తాత్కాలిక పరిస్కారానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవ చూపారు. ‘ఈనాడు’లో జూన్‌ 28, 29 తేదీల్లో ప్రచురితమైన వరస కథనాల ద్వారా (మేమున్నాం.. మీకు తోడుగా..’, ‘చినుకు పడితే.. రాకపోకలు బంద్‌..’ శీర్షికలతో) పలు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన ఆయన బుధవారం కల్వర్టు వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. శాశ్వత వంతెన నిర్మాణానికి సమయం పడుతుందని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా గొట్టాలు వేసి తాత్కాలిక వంతెన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీని కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.8 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, తక్షణమే పనులను ప్రారంభించారు. శాశ్వత వంతెన నిర్మాణానికి రూ.1.49 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని