logo

శునకాల బెడద తప్పించండి..

సిద్దిపేటలో బల్దియా కౌన్సిల్‌ సమావేశం బుధవారం సాదాసీదాగా జరిగింది. ఛైర్‌పర్సన్‌ మంజుల అధ్యక్షతన వివిధ అంశాలపై చర్చించారు. సమస్యలను కౌన్సిలర్లు దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Published : 30 Jun 2022 01:51 IST

బల్దియా కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు


మాట్లాడుతున్న బల్దియా అధ్యక్షురాలు మంజుల, కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కనకరాజు

సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేటలో బల్దియా కౌన్సిల్‌ సమావేశం బుధవారం సాదాసీదాగా జరిగింది. ఛైర్‌పర్సన్‌ మంజుల అధ్యక్షతన వివిధ అంశాలపై చర్చించారు. సమస్యలను కౌన్సిలర్లు దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం 19 అంశాలను ఎజెండాలో పొందుపర్చగా సభ్యులు ఆమోదించారు. ప్రధానంగా కుక్కల బెడద నివారించాలని, అడ్డుగా ఉన్న కొమ్మలు తొలగించాలని, ఇతరత్రా ఇబ్బందులు తీర్చాలంటూ గళమెత్తారు. నీటి సరఫరా, నిర్వహణ సహా 32 మంది కాంట్రాక్టు కార్మికుల నియామకానికి రూ.93 లక్షలు కేటాయించడంపై పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బల్దియా ఆధ్వర్యంలో ఏవైనా కార్యక్రమాలు చేపడితే సమావేశం ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జంగిటి కనకరాజు, కోఆప్షన్‌ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సహా వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఉదయం 11 గంటల తరువాత ప్రారంభమైన సమావేశం దాదాపు గంటన్నరలోనే ముగించేశారు.

* పట్టణంలోని పాత గ్రంథాలయ భవనం పక్కన ప్రజాశౌచాలయాన్ని బల్దియా అధ్యక్షురాలు మంజుల, కమిషనర్‌ రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. బుస్సాపూర్‌లో బయోగ్యాస్‌ ప్లాంట్‌లో తడి చెత్తతో తయారైన సేంద్రియ ఎరువును విక్రయించనున్నట్లు తెలిపారు. 40 కిలోల సంచిని రూ.600కు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని