logo

‘బిట్‌కాయిన్‌’ పేరుతో సైబర్‌ మోసం

సైబర్‌ నేరస్థుల చేతిలో మోసపోయిన మహిళ సకాలంలో స్పందించడంతో నగదు చేజారకుండా పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. సిద్దిపేట కమిషనర్‌ శ్వేత తెలిపిన వివరాలు.. కొండపాక మండలం మేధినీపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం భవాని

Published : 30 Jun 2022 01:51 IST

నగదు బదిలీ కాకుండా నిలిపిన పోలీసులు

న్యూస్‌టుడే, కొండపాక: సైబర్‌ నేరస్థుల చేతిలో మోసపోయిన మహిళ సకాలంలో స్పందించడంతో నగదు చేజారకుండా పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. సిద్దిపేట కమిషనర్‌ శ్వేత తెలిపిన వివరాలు.. కొండపాక మండలం మేధినీపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం భవాని తన మిత్రుడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఐడీ నుంచి సైబర్‌ నేరగాడు బిట్‌కాయిన్‌లో రూ.50 వేలు పెట్టుబడి పెడితే గంటలో రూ.4 లక్షలు వస్తాయని రాశాడు. నమ్మిన భవాని.. మరో నంబరుకు రూ.50 వేలు ఫోన్‌పే చేసింది. డబ్బులు రావాలంటే మరో రూ.30 వేలు పంపించమని చెప్పడంతో మళ్లీ ఆమె పంపింది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా బ్లాక్‌ అవడం గమనించింది. అనుమానంతో మిత్రుడికి ఫోన్‌ చేయగా రెండు నెలల క్రితమే ఎవరో హ్యాక్‌ చేసినట్లు చెప్పాడు. వెంటనే ఆమె జాతీయ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేసింది. సంబంధిత యంత్రాంగం రూ.80 వేలను నేరగాడి ఖాతాకు బదిలీ కాకుండా నిలుపుదల చేశారు. ఇప్పటివరకు సైబర్‌ నేరాల్లో పోగొట్టుకున్న మొత్తం రూ.80 లక్షలను నిలుపుదల చేశామని సీపీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని