logo

చేర్యాలలో అరుదైన నగ్నక బంధ శిల్పం గుర్తింపు

చేర్యాల పట్టణ శివారులోని పొలాల్లో 1,500 ఏళ్లనాటి అరుదైన నగ్నక బంధ శిల్పం లభ్యమైంది. మాతృదేవతారాధనకు దర్పణం పట్టేలా ఉన్న ఈ రాతి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బుధవారం గుర్తించారు. ఈ మేరకు క్షేత్రపరిశోధన

Published : 30 Jun 2022 01:51 IST

చేర్యాల పట్టణ శివారులోని పొలాల్లో 1,500 ఏళ్లనాటి అరుదైన నగ్నక బంధ శిల్పం లభ్యమైంది. మాతృదేవతారాధనకు దర్పణం పట్టేలా ఉన్న ఈ రాతి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బుధవారం గుర్తించారు. ఈ మేరకు క్షేత్రపరిశోధన చేసిన బి.వెంకటరమణ మాట్లాడుతూ.. 5 అంగుళాల ఎత్తు, 9 అంగుళాల పొడవున్న రాతిపై చెక్కిన నగ్నక బంధ శిల్పం గురించి వివరించారు. పెద్ద స్త్రీ మూర్తి, శిరస్సు స్థానంలో వికసిత పద్మంతో నిండైన వక్షోజాలతో, కడియాలున్న రెండు కాళ్లపై కూర్చున్నట్లుగా ఉండగా.. కుడివైపున్న రాతిదిమ్మెపై శిల్పం స్పష్టంగా కనిపించడం లేదు. చాళుక్యరాణి మహదేవి ఖాండువుల తన వైవాహిక సంతోషానికి, ఆరోగ్యానికి మొక్కుకొని ప్రతిష్ఠించిన నగ్నక బంధ ఆలంపురంలో పూజలందుకొంటోంది. బాదామిలో పురావస్తుశాఖ మ్యూజియంలో ఒక లజ్జాగౌరి శిల్పం ఉంది. కీసరలో 4వ శతాబ్దపు మాతృదేవతా శిల్పం లభించింది. సింగరాయలొద్దిలో కూడా 1వ శతాబ్దానికి చెందిన నగ్నకబంధ విగ్రహం లబించింది. ఈ శిల్పాన్ని ‘నగ్నకబంధ’, ‘ఉత్తానపాద’, ‘లజ్జాగౌరి’, ‘ఎల్లమ్మ’ అనికూడా అంటారని వివరించారు.

- న్యూస్‌టుడే, చేర్యాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని